
కీర్తనలు 43
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 43 మోసపూరిత వ్యతిరేకత నుండి నిర్దోషిత్వాన్ని కోరి తిరస్కారం ఎందుకు ఇంత నిజమైనదిగా అనిపిస్తుందని అడుగుతుంది. వెలుగు, సత్యం పరిశుద్ధ కొండకు తిరిగి మార్గదర్శకంగా మారతాయి, అక్కడ నిరుత్సాహపడిన ఆత్మ నూతన ఆరాధన, స్తుతిని ఆశిస్తుంది.
మార్గదర్శకత్వంనిర్దోషిత్వంఆరాధననిరీక్షణ
1నా దేవా, నాకు న్యాయం తీర్చండి, భక్తిహీనులైన ప్రజలకు వ్యతిరేకంగా నా పక్షంగా వాదించి, మోసగాళ్ల నుండి దుష్టుల నుండి నన్ను విడిపించండి.
2మీరే దేవుడు, నా బలమైన కోట. నన్నెందుకు ఇలా తిరస్కరించారు? శత్రువులచేత అణచివేయబడుతూ నేనెందుకు దుఃఖంతో గడపాలి?
3మీ వెలుగును మీ సత్యాన్ని పంపండి; అవి నన్ను మీ పరిశుద్ధ పర్వతానికి మీ నివాసస్థలానికి నడిపిస్తాయి.
4అప్పుడు నేను దేవుని బలిపీఠం దగ్గరకు వెళ్తాను, నా ఆనందం సంతోషం కలిగించే దేవుని దగ్గరకు వెళ్తాను. దేవా! నా దేవా! వీణతో నేను మిమ్మల్ని స్తుతిస్తాను.
5నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు? నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు? దేవుని మీద నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షకుడు నా దేవుడు నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.