Scheming courtiers whisper while families shelter by a bright river beneath an eagle's wings

కీర్తనలు 36

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 36 తనను తాను ముఖస్తుతి చేసుకుని నిగ్రహం లేకుండా హాని ప్రణాళికలు వేసుకునే దుష్క్రియను నిర్ధారిస్తుంది. ఆ చీకటికి వ్యతిరేకంగా, దైవిక ప్రేమ ఆకాశాన్ని చేరుకుంటుంది, న్యాయం పర్వతాల వలె నిలబడుతుంది, సమృద్ధమైన జీవితం వెలుగు నదిగా ప్రవహిస్తుంది.
స్థిరమైన ప్రేమన్యాయంజీవితంమోసం
1దుష్టుల పాప స్వభావాన్ని గురించి నా హృదయంలో నేను దేవుని నుండి వర్తమానం పొందుకున్నాను; వారి కళ్లలో దేవుని భయం లేదు.
2తమ పాపం బయటపడి దాన్ని ద్వేషించే వరకు వారు తమను తాము పొగడుకొంటారు.
3వారి నోటి మాటల్లో దుష్టత్వం, మోసం నిండి ఉన్నాయి; వారు తెలివిగా వ్యవహరించడంలో, మంచి చేయడంలో విఫలమవుతారు.
4వారి పడకలపై ఉండగానే చెడుకు కుట్ర చేస్తారు; వారు తమ పాప మార్గాల్లో వెళ్తారు తప్పును తిరస్కరించరు.
5యెహోవా! మీ మారని ప్రేమ ఆకాశాన్ని మీ విశ్వాస్యత అంతరిక్షాన్ని తాకుతుంది.
6మీ నీతి దేవుని ఉన్నత పర్వతాల్లా, మీ న్యాయం అగాధ సముద్రంలా ఉన్నాయి. యెహోవా! మీరు మనుష్యులను జంతువులను సంరక్షిస్తున్నారు.
7దేవా! మీ మారని ప్రేమ ఎంత అమూల్యమైనది! నరులు మీ రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారు.
8మీ మందిరంలోని సమృద్ధి వల్ల వారు సంతృప్తి పొందుతున్నారు; మీ ఆనంద నది నుండి మీరు వారికి త్రాగడానికి ఇస్తారు.
9ఎందుకంటే మీ దగ్గర జీవపుఊట ఉంది; మీ వెలుగులోనే మేము వెలుగును చూడగలము.
10మిమ్మల్ని ఎరిగిన వారిపైన మీ మారని ప్రేమను, యథార్థ హృదయులపై మీ నీతిని కొనసాగించండి.
11గర్విష్ఠుల పాదం నాపైకి రానివ్వకండి, దుష్టుల చేతులు నన్ను తరుమనివ్వకండి.
12కీడుచేసేవారు ఎలా కూలిపోయారో, క్రిందకు త్రోయబడి, మళ్ళీ లేవలేకుండ ఎలా ఉన్నారో చూడండి!

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.