
కీర్తనలు 30
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 30 ప్రాణాంతక అనారోగ్యం, ప్రమాదం నుండి పునరుద్ధరణ కోసం కృతజ్ఞతలు తెలుపుతుంది. రాత్రంతా ఏడుపు ఉదయం సంతోషానికి దారితీస్తుంది, ఆత్మవిశ్వాసం సరిదిద్దబడుతుంది, దుఃఖం నృత్యంగా మారుతుంది, నూతన జీవితం కృతజ్ఞతా స్తుతిలో మౌనాన్ని తిరస్కరిస్తుంది.
స్వస్థతసంతోషందుఃఖంకృతజ్ఞత
1యెహోవా, నేను మిమ్మల్ని ఘనపరుస్తాను, ఎందుకంటే నా శత్రువులు నాపై విజయం సాధించకుండ మీరు నన్ను పైకి లేవనెత్తారు.
2యెహోవా, నా దేవా, సహాయం కోసం నేను మీకు మొరపెట్టగా, మీరు నన్ను స్వస్థపరిచారు.
3యెహోవా, పాతాళం నుండి నా ప్రాణానికి పైకి లేవనెత్తారు; సమాధిలోనికి వెళ్లకుండా నన్ను కాపాడారు.
4యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించండి; ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించండి.
5ఆయన కోపం క్షణికం, కాని ఆయన దయ జీవితాంతం వరకు ఉంటుంది; రాత్రంతా దుఃఖం ఉన్నప్పటికీ, ఉదయాన్నే ఆనంద కలుగుతుంది.
6నేను క్షేమంగా ఉన్నప్పుడు, “నేను ఎప్పటికీ కదల్చబడను” అని అన్నాను.
7యెహోవా, మీ దయతో నన్ను పర్వతంలా స్థిరపరిచారు. కాని మీరు మీ ముఖాన్ని దాచినప్పుడు నేను కలవరపడ్డాను.
8యెహోవా నేను మీకు మొరపెట్టాను; ప్రభువా కరుణ కోసం నేను మీకు మొరపెట్టాను:
9“నేను నా రక్తాన్ని కార్చితే ఏమి లాభం? సమాధిలోనికి వెళ్తే ఏమి లాభం? మట్టి మిమ్మల్ని స్తుతిస్తుందా? అది మీ నమ్మకత్వాన్ని ప్రకటిస్తుందా?
10యెహోవా! ఆలకించండి కరుణించండి. యెహోవా, నాకు సహాయంగా ఉండండి.”
11మీరు నా దుఃఖాన్ని నాట్యంగా మార్చారు; మీరు నా గోనెపట్టను తీసివేసి ఆనంద వస్త్రాన్ని తొడిగించారు.
12నా హృదయం మౌనంగా ఉండక మీకు స్తుతులు పాడుతుంది. యెహోవా, నా దేవా, నేను మిమ్మల్ని ఎల్లప్పుడు స్తుతిస్తాను.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.