A violent thunderstorm breaks a cedar as worshipers watch safely from a stone sanctuary

కీర్తనలు 29

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 29 సముద్రం నుండి అడవి, అరణ్యానికి కదిలే ఉరుము ద్వారా దైవిక మహిమను వింటుంది. సృష్టి వణుకుతుంది, ఆరాధన విస్మయంతో స్పందిస్తుంది, అపారమైన ప్రదర్శన ప్రజల కోసం బలం, శాంతితో ముగుస్తుంది.
తుఫానుసృష్టిమహిమశాంతి
1దేవ కుమారులారా, యెహోవాకు ఆపాదించండి, మహిమను బలాన్ని యెహోవాకు ఆపాదించండి.
2యెహోవా నామానికి చెందాల్సిన మహిమను ఆయనకే ఆపాదించండి; ఆయన పరిశుద్ధ వైభవాన్ని బట్టి యెహోవాను ఆరాధించండి.
3యెహోవా స్వరం సముద్రం మీద ప్రతిధ్వనిస్తుంది; మహిమగల దేవుడు ఉరుముతారు మహాజలాల మీద యెహోవా స్వరం ప్రతిధ్వనిస్తోంది.
4యెహోవా స్వరం శక్తివంతమైనది; యెహోవా స్వరం ఘనమైనది.
5యెహోవా స్వరానికి దేవదారు చెట్లు విరిగి పడిపోతాయి; లెబానోను దేవదారు చెట్లను యెహోవా ముక్కలుగా చేస్తారు.
6ఆయన లెబానోను పర్యతాలను దూడలా, షిర్యోనును అడవి దూడలా చెంగున గంతులు వేసేలా చేస్తారు.
7యెహోవా స్వరం అగ్ని జ్వాలలను పుట్టిస్తుంది;
8యెహోవా స్వరం ఎడారిని వణికిస్తుంది. యెహోవా కాదేషు అరణ్యాన్ని కదిలిస్తారు.
9యెహోవా స్వరం లేళ్లను ఈనజేస్తుంది అడవిలోని ఆకులు రాలిపోయేలా చేస్తుంది. ఆయన ఆలయంలోని సమస్తం ఆయనకే, “మహిమ” అంటున్నాయి.
10యెహోవా ప్రళయజలాల మీద ఆసీనులయ్యారు; ఆయనే నిరంతరం రాజుగా పరిపాలిస్తున్నారు.
11యెహోవా తన ప్రజలకు బలాన్ని దయచేస్తారు; యెహోవా సమాధానంతో తన ప్రజలను ఆశీర్వదిస్తారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.