Pilgrims climb the holy hill while enormous city gates open before musicians and a veiled ark

కీర్తనలు 24

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 24 మొత్తం లోకం దేవుని సొంతమని ప్రకటించి, శుభ్రమైన చేతులు, నిజమైన హృదయాలతో ఎవరు ఎక్కగలరని అడిగి, గంభీరమైన ఊరేగింపు ద్వారా మహిమాన్విత రాజును స్వాగతించమని పురాతన ద్వారాలను పిలుస్తుంది.
సృష్టినిజాయితీఆరాధనమహిమ
1భూమి, దానిలో ఉండే సమస్తం, లోకం, దానిలో నివసించేవారు యెహోవా సొత్తు.
2ఆయన సముద్రంపై భూమికి పునాది వేశారు. జలాల మీద ఆయన దాన్ని స్థాపించారు.
3యెహోవా పర్వతాన్ని అధిరోహించగల వారెవరు? ఆయన పవిత్ర స్థలంలో నిలువగలవారెవరు?
4ఎవరి చేతులు నిర్దోషమైనవో ఎవరి హృదయం శుద్ధమైనదో, ఎవరు విగ్రహాల మీద నమ్మిక ఉంచరో, ఎవరు మోసపూరితంగా ప్రమాణాలు చేయరో, వారే కదా!
5వారు యెహోవా నుండి దీవెన పొందుతారు వారి రక్షకుడైన దేవునిచే నీతిమంతులుగా తీర్చబడతారు.
6ఆయనను వెదికే తరం ఇదే, యాకోబు దేవా, మీ ముఖకాంతిని వెదకేవారు అలాంటివారే. సెలా
7గుమ్మాల్లారా! మీ తలలు పైకెత్తండి; మహిమగల రాజు ప్రవేశించేలా పురాతన ద్వారాల్లారా! పైకి లేవండి.
8ఈ మహిమగల రాజు ఎవరు? శక్తిమంతుడు బలశాలియైన యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా.
9గుమ్మాల్లారా! మీ తలలు పైకెత్తండి; మహిమగల రాజు ప్రవేశించేలా పురాతన ద్వారాల్లారా! పైకి లేవండి.
10ఈ మహిమగల రాజు ఎవరు? సైన్యాలకు అధిపతియైన యెహోవాయే ఆయనే ఈ మహిమగల రాజు. సెలా

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.