
కీర్తనలు 133
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 133 సామూహిక ఐక్యతను విలువైన, సమృద్ధమైన, జీవాన్నిచ్చేదిగా కొనియాడుతుంది. సుగంధ అభిషేక తైలం, తాజాపరిచే పర్వత మంచు వ్యక్తులకు మించి ప్రవహించే ఆశీర్వాదాన్ని చిత్రిస్తాయి, వైవిధ్యమైన ఒడంబడిక కుటుంబాన్ని పంచుకున్న జీవితంలోకి కలుపుతాయి.
ఐక్యతఅభిషేకంఆశీర్వాదంసమాజం
1సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు! ఎంత మనోహరం!
2అది అహరోను తలమీద పోయబడి అతని గడ్డం మీదుగా కారుతూ, వస్త్రపు అంచు వరకు కారిన ప్రశస్తమైన తైలం వంటిది.
3అది సీయోను కొండలమీదికి దిగివచ్చే హెర్మోను మంచులా ఉంటుంది. యెహోవా తన ఆశీర్వాదాన్ని, జీవాన్ని కూడా నిరంతరం అక్కడ కుమ్మరిస్తారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.