
కీర్తనలు 13
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 13 విలాప కదలికను సంక్షిప్తీకరిస్తుంది: సుదీర్ఘ విడనాడటం, తక్షణ విన్నపం, నూతన నమ్మకం, గీతం. పరిస్థితులు తీవ్రంగానే ఉంటాయి, అయినా గుర్తుచేసుకున్న విశ్వసనీయ ప్రేమ పరిష్కారం పూర్తిగా కనిపించక ముందే స్తుతిని అనుమతిస్తుంది.
విలాపంవేచి ఉండటంనమ్మకంస్తుతి
1యెహోవా, ఎంతకాలం నన్ను మరచిపోతారు? ఎంతకాలం మీ ముఖాన్ని నా నుండి దాచిపెడతారు?
2ఎంతకాలం నా ఆలోచనలతో నేను పెనుగులాడాలి? ఎంతకాలం నా హృదయంలో నేను దుఃఖపడాలి? ఎంతకాలం నా శత్రువు నాపై విజయం సాధిస్తాడు?
3యెహోవా నా దేవా, నన్ను చూసి జవాబివ్వండి, నా కళ్లకు వెలుగివ్వండి, లేకపోతే నేను మరణంలో నిద్రపోతాను.
4“మేము అతన్ని ఓడించాము” అని నా శత్రువులు చెప్పుకోనివ్వకండి, నేను పడిపోయినప్పుడు నా శత్రువులను ఆనందించనివ్వకండి.
5అయితే నేను మారని మీ ప్రేమను నమ్ముతున్నాను; మీ రక్షణలో నా హృదయం సంతోషిస్తుంది.
6యెహోవా నా మీద దయ చూపారు, కాబట్టి నేను ఆయనకు స్తుతి పాడతాను.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.