A worker pours refined silver while poor families cry out and courtiers whisper nearby

కీర్తనలు 12

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 12 గర్విష్ఠమైన, ముఖస్తుతి మాటలను వెండిలా శుద్ధి చేయబడిన వాగ్దానాలతో పోలుస్తుంది. తారుమారు సంస్కృతిలో, బలహీనులు సహాయం కోసం మొరపెట్టుకుంటారు, నమ్మదగిన మాటలు నిలకడైన రక్షణ మూలంగా మారతాయి.
మాటలుసత్యంరక్షణపేదలు
1యెహోవా, సహాయం చేయండి, ఎందుకంటే ఒక్కరైన నమ్మకమైనవారు లేరు; నమ్మకమైనవారు మనుష్యజాతి నుండి గతించిపోయారు.
2ప్రతి ఒక్కరు తమ పొరుగువారితో అబద్ధమాడుతున్నారు; వారు తమ హృదయాల్లో మోసం పెట్టుకుని తమ పెదవులతో పొగడుతారు.
3పొగిడే ప్రతి పెదవిని గొప్పలు చెప్పుకునే ప్రతి నాలుకను యెహోవా మౌనం చేయును గాక.
4“మా నాలుకలతో మేము గెలుస్తాం; మా పెదవులు మమ్మల్ని కాపాడతాయి; మామీద ప్రభువెవరు?” అని వారంటారు.
5“దీనులు దోపిడికి గురవుతున్నారు, అవసరంలో ఉన్నవారు మూల్గుతున్నారు కనుక, నేను ఇప్పుడే లేచి దుర్భాషలాడే వారి నుండి నేను వారిని రక్షిస్తాను” అని యెహోవా అంటున్నారు.
6యెహోవా మాటలు నిర్దోషమైనవి, అవి మట్టి మూసలో శుద్ధి చేసిన వెండిలా పవిత్రమైనవి, ఏడుసార్లు శుద్ధి చేయబడిన బంగారం లాంటివి.
7యెహోవా, అవసరంలో ఉన్నవారిని మీరు క్షేమంగా ఉంచుతారు ఈ చెడ్డతరం వారి నుండి నిత్యం కాపాడతారు,
8మానవులలో నీచ ప్రవర్తన ఎక్కువైనప్పుడు, దుష్టులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.