An elder teaches children in a sanctuary courtyard as families distribute food across fertile fields

కీర్తనలు 111

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 111 మహిమాన్విత కార్యాలను, దయగల సదుపాయాన్ని, ఒడంబడిక విశ్వసనీయతను, నిలకడైన న్యాయాన్ని కొనియాడుతుంది. జాగ్రత్తైన సామూహిక జ్ఞాపకం భక్తియుక్త జ్ఞానానికి, ఆచరించిన అవగాహనకు, ఒక తరానికి మించి కొనసాగే కృతజ్ఞతా స్తుతికి దారితీస్తుంది.
కార్యాలుఒడంబడికజ్ఞానంస్తుతి
1యెహోవాను స్తుతించండి. యథార్థవంతుల సభలో సమాజంలో నేను హృదయమంతటితో యెహోవాను స్తుతిస్తాను.
2యెహోవా కార్యాలు గొప్పవి; వాటిలో ఆనందించే వారందరు వాటి గురించి ధ్యానిస్తారు.
3ఆయన క్రియలు కీర్తనీయమైనవి ప్రభావవంతమైనవి, ఆయన నీతి నిరంతరం ఉంటుంది.
4మనుష్యులకు జ్ఞాపకముండేటట్లు ఆయన అద్భుతాలు చేస్తారు; యెహోవా దయామయుడు. కనికరం గలవారు.
5భయభక్తులు గలవారిని పోషిస్తారు. ఆయన తన నిబంధన ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటారు.
6తన ప్రజలకు ఇతర దేశాలను వారసత్వంగా ఇచ్చి, తన క్రియలలోని బలప్రభావాలను వారికి వెల్లడించారు.
7ఆయన చేతుల పనులు విశ్వసనీయమైనవి న్యాయమైనవి; ఆయన కట్టడలు నమ్మదగినవి.
8అవి శాశ్వతంగా స్థాపించబడ్డాయి, నమ్మకత్వంతో యథార్థతతో అవి చేయబడ్డాయి.
9ఆయన తన ప్రజలకు విమోచన సమకూర్చారు; ఆయన తన ఒడంబడికను శాశ్వతంగా నియమించారు, ఆయన నామం పరిశుద్ధమైనది భీకరమైనది.
10యెహోవాయందు భయం జ్ఞానానికి మూలం; ఆయన కట్టడలను పాటించేవారు మంచి గ్రహింపు కలిగి ఉంటారు. స్తుతి నిత్యం ఆయనకే చెందును.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.