A priest offers bread and a cup to a kneeling king beside gathered volunteers and abandoned weapons

కీర్తనలు 110

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
శత్రువులు తిరగలేని దైవికంగా అధికారం పొందిన పాలకుడిని కీర్తన 110 చిత్రిస్తుంది. రాజ విజయం మెల్కీసెదెకుతో అనుబంధించబడిన నిలకడైన యాజకత్వంతో కలుస్తుంది, ఇష్టపూర్వక ప్రజలు ఉదయపు మంచు తాజాదనంతో సమకూడతారు.
రాజరికంయాజకత్వంఅధికారంవిజయం
1యెహోవా నా ప్రభువుతో చెప్పిన మాట: “నేను నీ శత్రువులను నీ పాదపీఠంగా చేసే వరకు నీవు నా కుడిచేతి వైపున కూర్చో.”
2యెహోవా, “నీ శత్రువుల మధ్య పరిపాలించు!” అని అంటూ, సీయోను నుండి మీ శక్తివంతమైన రాజదండాన్ని విస్తరిస్తూ, అంటారు,
3మీ యుద్ధ దినాన మీ దళాలు ఇష్టపూర్వకంగా వస్తాయి. పవిత్ర వైభవాన్ని ధరించుకున్నవారై ఉదయపు గర్భం నుండి మంచులా మీ యువకులు మీ దగ్గరకు వస్తారు.
4“మెల్కీసెదెకు క్రమంలో, నీవు నిరంతరం యాజకునిగా ఉన్నావు” అని యెహోవా ప్రమాణం చేశారు ఆయన తన మనస్సు మార్చుకోరు.
5ప్రభువు మీ కుడి ప్రక్కనే ఉన్నాడు; తన ఉగ్రత దినాన ఆయన రాజులను తుత్తునియలుగా చేస్తాడు.
6అతడు దేశాలను శిక్షిస్తాడు వారి భూములను శవాలతో నింపుతాడు; అతడు సర్వ భూమిపై పాలకులను ముక్కలు చేస్తాడు.
7దారిలో అతడు వాగు నీళ్లు త్రాగుతాడు, కాబట్టి అతడు తల పైకెత్తుతాడు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.