
కీర్తనలు 100
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
మొత్తం భూమిని సంతోషకరమైన సేవ, ఆనందకరమైన గానం, కృతజ్ఞతాపూర్వక పవిత్ర ఆవరణాల్లోకి కీర్తన 100 ఆహ్వానిస్తుంది. ఆరాధన సృష్టికర్త, కాపరికి చెందిన భావనపై ఆధారపడి ఉంటుంది, వారి మంచితనం, స్థిరమైన ప్రేమ, విశ్వసనీయత ప్రతి తరం ద్వారా కొనసాగుతాయి.
కృతజ్ఞతసంతోషంచెందికవిశ్వసనీయత
1భూలోకమంతా యెహోవాను స్తుతిస్తూ ఆనంద ధ్వనులు చేయాలి.
2సంతోష పూర్వకంగా యెహోవాను సేవించండి; పాడుతూ ఆయన సన్నిధిలోకి రండి.
3యెహోవాయే దేవుడని గ్రహించండి. ఆయనే మన సృష్టికర్త, మనం ఆయన వారం; మనం ఆయన ప్రజలం, ఆయన మేపే గొర్రెలం.
4కృతజ్ఞతతో ఆయన ద్వారాల గుండా ప్రవేశించండి, స్తుతితో ఆయన ఆవరణంలోకి ప్రవేశించండి; ఆయనకు వందనాలు చెల్లించండి, ఆయన నామమును స్తుతించండి.
5యెహోవా మంచివారు ఆయన మారని ప్రేమ శాశ్వతమైనది; ఆయన నమ్మకత్వం తరతరాలకు ఉంటుంది.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.