
సామెతలు 29
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
సరిదిద్దడాన్ని మొండిగా తిరస్కరించడం పతనంతో ముగుస్తుంది, నీతియుక్త నాయకత్వం ప్రజా సంతోషాన్ని తెస్తుంది. న్యాయం పేదలను రక్షిస్తుంది, జ్ఞానవంతమైన క్రమశిక్షణ పిల్లలకు నిరీక్షణ ఇస్తుంది, అదుపు లేని కోపం సంఘర్షణను వ్యాపింపజేస్తుంది, ప్రజలకు భయపడటం నమ్మకం ద్వారా అధిగమించబడే ఉరిగా మారుతుంది.
న్యాయంనాయకత్వంక్రమశిక్షణనమ్మకం
1ఎన్నిమారులు గద్దించినను మాట విననివాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవుతాడు.
2నీతిమంతులు వృద్ధి చెందినప్పుడు ప్రజలు సంతోషిస్తారు; దుష్టులు ఏలునపుడు, ప్రజలు మూల్గుతారు.
3జ్ఞానాన్ని ప్రేమించేవాడు తన తండ్రికి ఆనందం కలిగిస్తాడు, కానీ వేశ్యల సహచరుడు తన సంపదను నాశనం చేస్తాడు.
4న్యాయం ద్వారా ఒక రాజు దేశానికి స్థిరత్వాన్ని ఇస్తాడు, కాని లంచం కోసం అత్యాశపడేవారు దానిని కూల్చివేస్తారు.
5పొరుగువారిని పొగడేవారు వారి పాదాలకు వలలు వేస్తున్నారు.
6కీడుచేసేవారు తమ సొంత పాపం ద్వార చిక్కుకుంటారు, కాని నీతిమంతుడు ఆనందంతో కేకలు వేస్తాడు సంతోషంగా ఉంటాడు.
7నీతిమంతులు పేదవారికి న్యాయం జరగాలని చూస్తారు, కాని దుష్టులకు అలాంటి ఆలోచించరు.
8ఎగతాళి చేసేవారు పట్టణాన్ని తల్లడిల్లజేస్తారు, జ్ఞానులు కోపం చల్లార్చెదరు.
9ఒకవేళ జ్ఞానియైన వ్యక్తి మూర్ఖునితో న్యాయస్థానానికి వెళ్తే, బుద్ధిహీనుడు కోపంతో ఎగతాళి చేస్తాడు, అప్పుడు అక్కడ వారికి సమాధానం ఉండదు.
10రక్తపిపాసులు నిజాయితీ కల వ్యక్తిని ద్వేషిస్తారు యథార్థవంతులను చంపాలని చూస్తారు.
11మూర్ఖులు వారి కోపాన్ని వెదజల్లుతారు, కాని జ్ఞానులు చివరికి ప్రశాంతత తెస్తారు.
12ఒకవేళ పాలకుడు అబద్ధాలు వింటే, తన అధికారులంతా దుష్టులవుతారు.
13పేదవారు అణగారినవారు దీనిని సాధారణంగా కలిగి ఉంటారు: వీరిద్దరి కళ్లకు చూపు ఇచ్చేవాడు యెహోవా.
14ఏ రాజు పేదలకు సత్యంగా న్యాయం తీరుస్తాడో, ఆ రాజు సింహాసనం శాశ్వతంగా స్థిరపరచబడుతుంది.
15బెత్తము గద్దింపు జ్ఞానాన్ని పుట్టిస్తుంది, కానీ క్రమశిక్షణ చేయబడని పిల్లవాడు తన తల్లిని అగౌరపరుస్తాడు.
16దుష్టులు వృద్ధిచెందునప్పుడు పాపం కూడా వృద్ధిచెందుతుంది, అయితే వారి పతనాన్ని నీతిమంతులు కళ్లారా చూస్తారు.
17మీ పిల్లలను క్రమశిక్షణ చేయండి, వారు మీకు నెమ్మదిని కలిగిస్తారు; మీరు కోరుకునే ఆనందాన్ని వారు మీకు ఇస్తారు.
18దైవిక నడిపింపు లేకపోతే ప్రజలు నిగ్రహాన్ని కోల్పోతారు; కాని జ్ఞానం యొక్క బోధ పట్ల శ్రద్ధ చూపేవాడు ధన్యుడు.
19సేవకులు కేవలం మాటల ద్వారా సరిదిద్దబడరు; వారు గ్రహించినా సరే స్పందించరు.
20త్వరపడి మాట్లాడేవాన్ని నీవు చూశావా? వారికన్నా బుద్ధిహీనునికి ఎక్కువ ఆశ.
21చిన్నప్పటి నుండి గారాబం పొందుకున్న దాసుడు పెంకితనం గలవానిగా అవుతాడు.
22ఒక కోపిష్ఠుడు గొడవలు రేపుతాడు మహా కోపిష్ఠియైన వ్యక్తి అనేక పాపాలు చేస్తాడు.
23గర్వము ఒక వ్యక్తిని దిగువకు తెస్తుంది, అయితే ఆత్మలో దీనుడైనవాడు గౌరవాన్ని పొందుతారు.
24దొంగల సహచరుడు తనను తాను గాయపరచుకుంటాడు; మీరు నిజం చెప్పమని ప్రమాణం చేశారు, కాని మీరు సాక్ష్యం చెప్పే ధైర్యం లేదు.
25మనుష్యుల భయం ఒక ఉచ్చు అని రుజువవుతుంది, కాని యెహోవాయందు నమ్మిక ఉంచేవారు క్షేమంగా ఉంటారు.
26పాలకునితో ప్రేక్షకులు ఉండాలని చాలామంది కోరుకుంటారు, అయితే న్యాయం యెహోవా నుండి వస్తుంది.
27నీతిమంతులు నిజాయితీ లేనివారిని అసహ్యించుకుంటారు; దుష్టులు యథార్థవంతులను అసహ్యించుకుంటారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.