Neighbors assist an honest poor traveler as parents guide children and planners confer nearby

సామెతలు 19

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
వంకర మాటతో కూడిన సంపద కంటే నిజాయితీ మేలు. పేదల పట్ల కరుణ కర్త్తకు సేవ, ఓపికగల క్రమశిక్షణ నిరీక్షణను అందిస్తుంది, అనేక ప్రణాళికలు హృదయాన్ని నింపినా దేవుని ఉద్దేశం చివరికి నిలబడుతుంది.
నిజాయితీకరుణక్రమశిక్షణదేవుని ఉద్దేశం
1నిజాయితీ లేనివాడు మూర్ఖుడు కావడం కంటే నిజాయితీగా ఉంటే మంచిది.
2ఒక వ్యక్తి తెలివిలేనివాడుగా ఉండడం మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును.
3ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వారి నాశనానికి దారితీస్తుంది, వారి హృదయంలో వారికి యెహోవా మీద కోపం వస్తుంది.
4డబ్బుగల వానికి స్నేహితులు ఎక్కువగా ఉందురు, పేదవాడు తన స్నేహితులను పోగొట్టుకుంటాడు.
5అబద్ధసాక్షి శిక్షను పొందక పోదు అబద్ధాలాడే వాడు తప్పించుకోడు.
6అనేకులు గొప్పవారి దయ వెదుకుతారు, బహుమతులు ఇచ్చేవారికి ప్రతి ఒక్కరూ స్నేహితులే.
7పేదవారిని తమ బంధువులందరు దూరంగా ఉంచుతారు, అలాంటప్పుడు వారి స్నేహితులు ఇంకెంత దూరంగా ఉంచుతారు! పేదవారు బ్రతిమిలాడుతూ వారిని వెంటాడినా, వారు ఎక్కడా కనిపించలేదు.
8తెలివి సంపాదించుకునేవారు తన ప్రాణమునకు ప్రేమించేవారు; మంచి చెడులను లెక్కచేయువారు మేలు పొందును.
9అబద్ధపు సాక్షి శిక్షను పొందును, అబద్ధాలాడే వాడు నశించును.
10భోగములను అనుభవించుట బుద్ధిలేని వానికి తగదు, రాజుల మీద పెత్తనము చెలాయించుట పనివానికి బొత్తిగా తగదు.
11ఒక వ్యక్తి తెలివి వానికి ఓర్పును కలిగిస్తుంది; ఒక నేరాన్ని పట్టించుకోకపోవడం ఒక వ్యక్తికి ఘనత కలిగిస్తుంది.
12రాజు కోపం సింహగర్జన వంటిది, అతని దయ తుక్కు మీద కురియు మంచు వంటిది.
13బుద్ధిహీనుని పిల్లలు తన తండ్రికి నష్టము తెచ్చును, భార్యతోటిపోరు ఆగకుండా పడుచుండు నీటిబొట్లతో సమానము.
14ఇల్లు సంపద పితరులు ఇచ్చిన స్వాస్థ్యం, వివేకంగల భార్య యెహోవా యొక్క దానము.
15సోమరితనం గాఢనిద్ర కలుగజేస్తుంది, సోమరివాడు తిండి లేక ఉంటాడు.
16ఆజ్ఞను పాటించేవాడు తనను తాను కాపాడుకుంటాడు, కానీ తన ప్రవర్తన విషయంలో జాగ్రత్తలేనివాడు చస్తాడు.
17బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాని ఉపకారానికి ఆయన తిరిగి ఉపకారం చేస్తారు.
18ఎందుకంటే అందులో ఆశ ఉన్నప్పుడే మీ పిల్లలను క్రమశిక్షణ చేయండి; అయితే వాడు మరణించాలని కోరుకోవద్దు.
19మహా కోపం గలవాడు శిక్ష తప్పించుకోడు, వాని తప్పించినను వాడు మరల కోప్పడుతూనే ఉంటాడు.
20నీవు ముందుకు జ్ఞానివగుటకై, ఆలోచన విని బోధను అంగీకరించు.
21ఒక వ్యక్తి హృదయంలో ఆలోచనలు అనేకంగా పుడతాయి, అయితే యెహోవా ఉద్దేశమే స్థిరము.
22ఒక వ్యక్తి కోరుకునేది నమ్మకమైన ప్రేమను, అబద్ధికునిగా కంటే పేదవానిగా ఉండడం మేలు.
23యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జీవమునకు దారి; అది కలిగినవాడు తృప్తి కలిగినవాడై అపాయం లేకుండా బ్రతుకును.
24సోమరి పాత్రలో చేయి ముంచునేగాని; తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు.
25ఎగతాళి చేసేవారు శిక్షింపబడగా చూసి సామాన్యులు వివేకం నేర్చుకుంటారు; మంచిచెడులు నెరిగిన వారిని గద్దింపగా వారు తెలివిని అభివృద్ధి చేసికొందురు.
26తండ్రిని దోచుకునేవాడు, తల్లిని వెళ్లగొట్టేవాడు, అవమానాన్ని అపకీర్తిని కలుగజేసేవాడు.
27నా కుమారుడా, ఒకవేళ నీవు ఉపదేశాన్ని వినుట మానిన ఎడల, నీవు తెలివిగల మాటల నుండి తప్పిపోతావు.
28అవినీతిపరుడైన సాక్షి న్యాయాన్ని ఎగతాళి చేస్తాడు, దుష్టుల నోరు పాపాన్ని జుర్రుకొంటుంది.
29హేళన చేయువారికి తీర్పులును బుద్ధిలేని వారి వీపులకు దెబ్బలను ఏర్పాటు చేయబడినవి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.