Families climbing toward higher ground as a vast flood rushes down a valley toward Philistine coastal cities

యిర్మీయా 47

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
ఫరో గాజాపై దాడి చేసేముందు, ఉత్తరం నుండి పెరుగుతున్న జలాలు ఫిలిష్తీయాను, దాని మిత్రులను ముంచెత్తుతాయని యిర్మీయా వర్ణిస్తాడు. సమీపిస్తున్న విపత్తు తల్లిదండ్రులను బలహీనం చేసి, పొరుగు తీరాల నుండి మద్దతును మౌనం చేసి, ఇంకా విశ్రమించలేని కత్తిగా మారుతుంది.
ఫిలిష్తీయావరదతీర్పువిలాపం
1ఫరో ఇంకా గాజా మీద దాడిచేయక ముందు ఫిలిష్తీయుల గురించి యిర్మీయా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు:
2యెహోవా ఇలా చెప్తున్నారు: “ఉత్తరాన జలప్రవాహాలు ఎలా ఎగసిపడుతున్నాయో చూడండి; అవి వరదలా పొంగి పొర్లిపారుతాయి. అవి దేశం మీద, అందులో ఉన్న వాటన్నిటి మీద, పట్టణాల మీద, వాటిలో నివసించేవారి మీద పొర్లిపారుతాయి. కాబట్టి ప్రజలంతా మొరపెడతారు; దేశంలో నివసించేవారంతా ఏడుస్తారు.
3పరుగెత్తే గుర్రాల డెక్కల శబ్దానికి, శత్రు రథాల శబ్దానికి వాటి చక్రాల శబ్దానికి వారు రోదిస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సహాయం చేయరు; వారి చేతులు బలహీనంగా ఉంటాయి.
4ఎందుకంటే ఆ రోజు వచ్చింది, ఫిలిష్తీయులందరినీ నాశనం చేసే రోజు తూరు, సీదోనులకు సహాయం చేసేవారందరిని తొలగించే రోజు తప్పకుండా వస్తుంది. యెహోవా ఫిలిష్తీయులను, కఫ్తోరు తీరాల్లో మిగిలి ఉన్నవారిని నాశనం చేయబోతున్నారు.
5గాజా దుఃఖంలో తల క్షౌరం చేసుకుంటుంది; అష్కెలోను నిశ్శబ్దం చేయబడుతుంది. సమతల మైదానంలో మిగిలి ఉన్నవారలారా, ఎంతకాలం మిమ్మల్ని మీరు గాయపరచుకుంటారు?
6“ ‘అయ్యో, యెహోవా ఖడ్గమా, నీవు ఎంత కాలానికి విశ్రాంతి తీసుకుంటావు? నీ ఒర లోనికి తిరిగివెళ్లి ప్రశాంతంగా విశ్రమించు.’
7అయితే అష్కెలోను మీదా, సముద్ర తీర ప్రాంతాల మీద దాడి చేయమని, యెహోవా దాన్ని ఆజ్ఞాపించినప్పుడు, అది ఎలా విశ్రమిస్తుంది?”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.