Mordecai listening to families and elders at the palace gate above a flourishing landscape

ఎస్తేరు 10

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
గ్రంథం రాజు అధికారాన్ని, మొర్దెకై రెండవ స్థానానికి పదోన్నతిని పేర్కొంటూ ముగుస్తుంది. మొర్దెకై తన ప్రజల మేలును కోరుతూ, రాబోయే తరాలకు శాంతి మాట్లాడుతూ యూదుల మధ్య గౌరవించబడతాడు.
మొర్దెకైనాయకత్వంప్రజా సేవమేలుశాంతి
1అహష్వేరోషు రాజు తన సామ్రాజ్యమంతట, సముద్ర తీరాల వరకు కప్పం విధించాడు.
2అతని బలప్రభావాలుగల చర్యలు, రాజు హెచ్చించిన మొర్దెకై యొక్క గొప్పతనం యొక్క పూర్తి వివరాలు, మాదీయులు, పర్షియా రాజుల చరిత్ర గ్రంథాల్లో వ్రాయబడలేదా?
3రాజైన అహష్వేరోషుకు రెండవ స్థానంలో యూదుడైన మొర్దెకై ఉన్నాడు, అతడు యూదులలో ప్రముఖునిగా, తన తోటి యూదులైన ఎంతోమంది ద్వారా గౌరవం పొందుకున్నాడు, ఎందుకంటే తన ప్రజల క్షేమాన్ని విచారిస్తూ, యూదులందరి యొక్క శ్రేయస్సు కోసం మాట్లాడేవాడు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.