
1 దినవృత్తాంతములు 9
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
ప్రవాసం తరువాత, ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, ఆలయ సేవకులు తమ పట్టణాలను, యెరూషలేమును తిరిగి స్థిరపరుచుకుంటారు. ద్వారపాలకులు, సంగీతకారులు, ఇతర కుటుంబాలు వారసత్వ బాధ్యతలను తిరిగి చేపట్టి, నగరంలో సాధారణ, నమ్మదగిన సేవ ద్వారా వ్యక్తమైన పునరుద్ధరణను చూపిస్తారు.
తిరిగి రావడంపునరుద్ధరణకర్తవ్యంసమాజం
1ఇశ్రాయేలు ప్రజలందరి పేర్లు తమ వంశాల ప్రకారం ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథంలో వ్రాయబడ్డాయి. వారు చేసిన నమ్మకద్రోహాన్ని బట్టి వారు బబులోనుకు బందీలుగా కొనిపోబడ్డారు.
2తమ సొంత పట్టణాల్లో తమ స్వాస్థ్యంలో మొదట నివసించిన వారెవరంటే, కొందరు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, ఆలయ సేవకులు.
3యూదా, బెన్యామీను, ఎఫ్రాయిం మనష్షే వారిలో యెరూషలేము పట్టణంలో నివసించినవారు:
4యూదా కుమారుడైన పెరెసు వారసుడు బానీ కుమారుడైన ఇమ్రీకి పుట్టిన ఒమ్రీ కుమారుడైన అమీహూదు పుట్టిన ఊతై.
5షేలానీయుల నుండి: మొదట కుమారుడైన అశాయా, అతని కుమారులు.
6జెరహు వారిలో నుండి: యెవుయేలు. యూదా నుండి మొత్తం 690 మంది.
7బెన్యామీనీయుల నుండి: హస్సెనూయా కుమారుడైన హోదవ్యాకు పుట్టిన మెషుల్లాము కుమారుడైన సల్లు;
8యెరోహాము కుమారుడైన ఇబ్నియా; మిక్రి కుమారుడైన ఉజ్జీకి పుట్టిన ఏలా; ఇబ్నెయా కుమారుడైన రెయూయేలుకు పుట్టిన షెఫట్యా కుమారుడైన మెషుల్లాము.
9తమ వంశావళి ప్రకారం బెన్యామీను నుండి ప్రజలు మొత్తం 956 మంది. వీరందరు తమ తమ కుటుంబాలకు పెద్దలు.
10యాజకుల నుండి: యెదాయా; యెహోయారీబు; యాకీను;
11అహీటూబు కుమారుడైన మెరాయోతుకు పుట్టిన సాదోకు కుమారుడు మెషుల్లాము పుట్టిన హిల్కీయా కుమారుడైన అజర్యా; ఇతడు దేవుని మందిరంలో ప్రముఖ అధిపతి;
12మల్కీయా కుమారుడైన పషూరుకు పుట్టిన యెరోహాము కుమారుడు అదాయా; ఇమ్మేరు కుమారుడైన మెషిల్లేమీతుకు పుట్టిన మెషుల్లాము కుమారుడైన యహజెరాకు పుట్టిన అదీయేలు కుమారుడైన మశై;
13తమ కుటుంబాలకు పెద్దలుగా ఉన్న యాజకుల సంఖ్య 1,760. వారు దేవుని మందిరంలో సేవలు అందించే బాధ్యత కలిగిన సమర్థులు.
14లేవీయుల నుండి: మెరారీయుడైన హషబ్యా కుమారుడైన అజ్రీకాముకు పుట్టిన హష్షూబు కుమారుడైన షెమయా;
15బక్బక్కరు, హెరెషు, గాలాలు, ఆసాపు కుమారుడైన జిఖ్రీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా;
16యెదూతూను కుమారుడైన గాలాలుకు పుట్టిన షెమయా కుమారుడైన ఓబద్యా; ఎల్కానాకు పుట్టిన ఆసా కుమారుడైన బెరెక్యా; ఇతడు నెటోపాతీయుల గ్రామాల్లో నివసించాడు.
17ద్వారపాలకులు: షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను, వారి తోటి లేవీయులు. వీరిలో షల్లూము పెద్ద.
18వారు తూర్పున ఉన్న రాజు ద్వారం దగ్గర ఇప్పటివరకు సేవ చేస్తున్నారు. వీరందరు లేవీయుల సమూహానికి చెందిన ద్వారపాలకులు.
19కోరహు కుమారుడైన ఎబ్యాసాపుకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూము, తన కోరహీయుల వంశంలోని తన తోటి ద్వారపాలకులు, తమ పూర్వికులు యెహోవా శిబిరానికి కావలివారిగా ఉన్నట్లుగా, వారు ఆలయద్వారాన్ని కాపలా కాసేవారు.
20పూర్వకాలంలో ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు ద్వారపాలకుల మీద అధికారిగా ఉన్నాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నారు.
21మెషెలెమ్యా కుమారుడైన జెకర్యా సమావేశ గుడారపు ద్వారానికి ద్వారపాలకుడు.
22ద్వారాల దగ్గర ద్వారపాలకులుగా ఎన్నుకోబడినవారు 212 మంది. వారు తమ గ్రామాల్లో తమ వంశాల ప్రకారం నమోదు చేయబడ్డారు. వారు నమ్మకమైన వారని దావీదు, దీర్ఘదర్శియైన సమూయేలు వారిని ఆ స్థానాల్లో నియమించారు.
23వారు వారి వారసులు సమావేశపు గుడారం అని పిలువబడే యెహోవా మందిరపు ద్వారాలకు కాపలా కాసే బాధ్యత కలిగి ఉన్నారు.
24ద్వారపాలకులు నలువైపులా ఉన్నారు అనగా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం వైపు ఉన్నారు.
25వారి గ్రామాల్లో ఉండే వారి తోటి లేవీయులు క్రమంగా వస్తూ ఏడు రోజులపాటు తమ విధులను పంచుకునేవారు.
26అయితే లేవీయులైన నలుగురు ప్రధాన ద్వారపాలకులు నమ్మకమైనవారు కాబట్టి దేవుని మందిరపు గదులకు, ఖజానాకు సంబంధించిన బాధ్యత వారికి ఇవ్వబడింది.
27వారు దేవుని ఆలయానికి కావలివారు కాబట్టి దాని దగ్గరే రాత్రంతా ఉండేవారు; ప్రతి ఉదయం దాని తలుపులు తెరిచే బాధ్యత వారిదే.
28వారిలో కొందరికి ఆలయ సేవలో ఉపయోగించే వస్తువుల బాధ్యత ఇవ్వబడింది; వాటిని లోపలికి తెచ్చినప్పుడు బయటకు తీసుకెళ్లినప్పుడు వారు వాటిని లెక్కించేవారు.
29ఇతరులకు ఉపకరణాలు, పరిశుద్ధాలయంలో ఉన్న ఇతర వస్తువులన్నిటి బాధ్యత ఇవ్వబడింది. వాటితో పాటు సన్నని పిండి, ద్రాక్షరసం, ఒలీవనూనె, ధూపద్రవ్యాలు, సుగంధద్రవ్యాలు వారి ఆధీనంలోనే ఉంటాయి.
30అయితే యాజకులలో కొంతమంది సుగంధ ద్రవ్యాల మిశ్రమాన్ని చేసేవారు.
31కోరహు వంశీయుడైన షల్లూము మొదటి కుమారుడైన మత్తిత్యా అనే లేవీయుడు నమ్మకమైనవాడు కాబట్టి అతనికి అర్పణల రొట్టెలు తయారుచేసే బాధ్యత ఇవ్వబడింది.
32వారి తోటి లేవీయులైన కహాతీయులలో కొందరికి ప్రతి సబ్బాతు దినం కోసం బల్లపై ఉంచే రొట్టెలు సిద్ధం చేసే బాధ్యత ఇవ్వబడింది.
33లేవీయుల కుటుంబ పెద్దలలో సంగీతకారులు దేవాలయపు గదుల్లో ఉండేవారు. వారు రాత్రింబగళ్ళు పని చేయాలి కాబట్టి వారికి వేరే ఏ పని అప్పగించబడలేదు.
34వీరందరు లేవీయుల కుటుంబ పెద్దలు, తమ వంశం ప్రకారం నాయకులు. వారు యెరూషలేములో నివసించారు.
35గిబియోను తండ్రియైన యెహీయేలు గిబియోనులో నివసించాడు. అతని భార్యపేరు మయకా.
36అతని మొదటి కుమారుడు అబ్దోను, తర్వాత సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు,
37గెదోరు, అహ్యో, జెకర్యా, మిక్లోతు పుట్టారు.
38మిక్లోతు షిమ్యాముకు తండ్రి. వీరు కూడా యెరూషలేములో తమ బంధువులకు దగ్గరలో నివసించారు.
39నేరు కీషుకు తండ్రి, కీషు సౌలుకు తండ్రి, యోనాతాను, మల్కీ-షూవ, అబీనాదాబు, ఎష్-బయలు అనేవారు సౌలు కుమారులు.
40యోనాతాను కుమారుడు: మెరీబ్-బయలు, ఇతడు మీకాకు తండ్రి.
41మీకా కుమారులు: పీతోను, మెలెకు, తరేయా, ఆహాజు.
42ఆహాజు యదాకు తండ్రి, ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీలకు తండ్రి. జిమ్రీ మోజా అనేవారు యదా కుమారులు.
43మోజా బిన్యాకు తండ్రి; బిన్యా కుమారుడు రెఫాయా, అతని కుమారుడు ఎలాశా, అతని కుమారుడు ఆజేలు.
44ఆజేలు కుమారులు ఆరుగురు. వారి పేర్లు ఇవి: అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హనాను. వీరు ఆజేలు కుమారులు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.