Families from many nations share a rich harvest and praise together beneath a bright peaceful sky

కీర్తనలు 67

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
ప్రతి జాతి దేవుని రక్షక మార్గాన్ని తెలుసుకోవాలని కీర్తన 67 దైవిక ఆశీర్వాదం కోసం అడుగుతుంది. న్యాయమైన మార్గదర్శకత్వం ప్రజలకు సంతోషానికి కారణాన్ని ఇస్తుంది, భూమి తన పంటను దిగుబడి చేస్తుంది, పొందిన సమృద్ధి లోకపు దూర సరిహద్దుల వరకు విస్తరించే సాక్ష్యంగా మారుతుంది.
జాతులుఆశీర్వాదంన్యాయంపంట
1దేవుడు మామీద దయచూపి దీవించును గాక, ఆయన ముఖం మాపై ప్రకాశించును గాక. సెలా
2తద్వార భూమి మీద మీ మార్గాలు దేశాలన్నిటికి మీ రక్షణ తెలుస్తాయి,
3దేవా, జనాంగాలు మిమ్మల్ని స్తుతించును గాక; సర్వ జనులు మిమ్మల్ని స్తుతించుదురు గాక.
4దేశాలు సంతోషించి ఆనంద గానం చేయుదురు గాక, ఎందుకంటే మీరు జనులను న్యాయంగా పరిపాలిస్తారు భూమి మీద దేశాలను పాలిస్తారు. సెలా
5దేవా, జనాంగాలు మిమ్మల్ని స్తుతించును గాక; సర్వ జనులు మిమ్మల్ని స్తుతించుదురు గాక.
6భూమి దాని పంటను ఇస్తుంది; దేవుడు, మా దేవుడు, మమ్మల్ని దీవిస్తారు.
7అవును, దేవుడు మనల్ని దీవించును గాక, తద్వార భూదిగంతాలలో ఉన్న ప్రజలంతా ఆయనకు భయపడుదురు గాక.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.