A king and community pray near offerings while horses and military standards stand distant

కీర్తనలు 20

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 20 సంఘర్షణకు ముందు తమ రాజు కోసం ప్రార్థించడానికి ప్రజలను సమకూరుస్తుంది. అర్పణలు, ప్రణాళికలు, నాయకత్వం దేవుడికి అప్పగించబడతాయి, నమ్మకం రథాలు, గుర్రాల కనిపించే బలానికి అతీతంగా ఉంటుంది.
ప్రార్థనరాజరికంనమ్మకంసమాజం
1కష్టకాలంలో యెహోవా మీకు జవాబిచ్చును గాక; యాకోబు దేవుని నామం మిమ్మల్ని కాపాడును గాక.
2తన పరిశుద్ధస్థలం నుండి ఆయన మీకు సహాయం పంపాలి, సీయోను నుండి మీకు మద్ధతు ఇవ్వాలి.
3మీ అర్పణలను ఆయన జ్ఞాపకం చేసుకోవాలి మీ దహనబలులను అంగీకరించాలి. సెలా
4ఆయన మీ హృదయ వాంఛను తీర్చాలి, మీ ప్రణాళికలన్నిటిని సఫలం చేయాలి.
5యెహోవా మీ రక్షణను బట్టి మేము ఆనందంతో కేకలు వేయాలి, మా దేవుని పేరట విజయపతాకాలు ఎగరవేయాలి. యెహోవా మీ మనవులన్నిటిని అనుగ్రహించాలి.
6యెహోవా తన అభిషిక్తునికి విజయాన్ని ఇస్తారని ఇప్పుడు నాకు తెలిసింది. రక్షణ కలిగించే తన కుడిచేతి మహాబలంతో ఆయన తన పరలోకపు పరిశుద్ధాలయం నుండి అతనికి జవాబిస్తారు.
7కొందరు రథాలను కొందరు గుర్రాలను నమ్ముతారు, కాని మేమైతే మా దేవుడైన యెహోవా నామాన్ని నమ్ముతాము.
8వారు పూర్తిగా పతనం చేయబడ్డారు, కాని మేము లేచి స్థిరంగా నిలబడతాము.
9యెహోవా, రాజుకు విజయం ఇవ్వండి! మేము మొరపెట్టినప్పుడు మాకు జవాబివ్వండి!

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.