
కీర్తనలు 15
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 15 సమగ్ర వ్యక్తిత్వ చిత్రం ద్వారా పరిశుద్ధత దగ్గర ఎవరు నివసించగలరని జవాబిస్తుంది. నిజాయితీ మాట, పొరుగువారి పట్ల శ్రద్ధ, ఆర్థిక నిజాయితీ, స్థిరమైన వాగ్దానాలు సాధారణ సంబంధాలు, ప్రజా ప్రవర్తనలో ఆరాధనను కనిపించేలా చేస్తాయి.
నిజాయితీఆరాధనసత్యంపొరుగువారి ప్రేమ
1యెహోవా, మీ పవిత్ర గుడారంలో ఉండగలవారు ఎవరు? మీ పరిశుద్ధ పర్వతంపై నివసించగలవారు ఎవరు?
2నిందారహితంగా నడుచుకొనేవారు, నీతిని జరిగించేవారు, తమ హృదయం నుండి సత్యాన్ని మాట్లాడేవారు;
3తమ నాలుకతో అపవాదులు వేయనివారు, పొరుగువారికి కీడు చేయనివారు, స్నేహితుల గురించి చెడుగా మాట్లాడనివారు;
4నీచులను అసహ్యించుకుని యెహోవాకు భయపడేవారిని గౌరవించేవారు; తమకు బాధ కలిగినా తాము చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకునేవారు, తమ మనస్సు మార్చుకొననివారు;
5వడ్డీ తీసుకోకుండ బీదలకు డబ్బు అప్పిచ్చేవారు; నిర్దోషులకు వ్యతిరేకంగా లంచం తీసుకోనివారు. వీటిని చేసేవారు ఎన్నటికి కదిలించబడరు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.