
కీర్తనలు 137
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
బబులోను నదుల పక్కన ప్రవాసుల దుఃఖం, సాంస్కృతిక ఒత్తిడి, తీవ్రమైన జ్ఞాపకం, పరిష్కరించని కోపాన్ని కీర్తన 137 భద్రపరుస్తుంది. మౌనమైన వీణలు పవిత్ర గీతాన్ని వినోదంగా మార్చడానికి నిరాకరిస్తాయి, యెరూషలేము పోయినది, మరచిపోనిది అవుతుంది.
ప్రవాసంసీయోనుదుఃఖంజ్ఞాపకం
1బబులోను నదుల దగ్గర మనం కూర్చుని సీయోను పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చాము.
2దాని మధ్యన ఉన్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించాము.
3మనల్ని పట్టుకున్నవారు పాటలు పాడమని మనల్ని అడిగారు, మనల్ని బాధించినవారు సంతోష గానాలు కోరారు; “సీయోను పాటల్లో ఒకటి పాడండి” అని అన్నారు.
4పరాయి దేశంలో ఉండగా యెహోవా పాటలు మనం ఎలా పాడగలము?
5యెరూషలేమా! నేను నిన్ను మరచిపోతే, నా కుడిచేయి దాని నేర్పును మరచిపోవాలి.
6నేను నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే, యెరూషలేము నాకు ఎక్కువ సంతోషం కలిగించేది అని నేను భావించకపోతే నా నాలుక నా అంగిలికి అంటుకుపోవాలి.
7యెహోవా, యెరూషలేము పడిపోయిన రోజున ఎదోము ప్రజలు ఏమి చేశారో జ్ఞాపకం చేసుకోండి. “దానిని నాశనం చేయండి. పునాదుల వరకు దానిని ధ్వంసం చేయండి!” అని వారు అరిచారు.
8త్వరలో నాశనమవ్వబోతున్న బబులోను కుమారీ, నీవు మాకు చేసిన కీడును బట్టి నీకు ప్రతీకారం చేసేవాడు ధన్యుడు.
9మీ పసిపిల్లల్ని పట్టుకుని వారిని బండకువేసి కొట్టేవాడు ధన్యుడు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.