
కీర్తనలు 131
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
గర్వం, గొప్ప ఆశయం, అశాంతమైన కోరికను తిరస్కరించి కీర్తన 131 ప్రశాంత ఆధారపడటాన్ని ఎంచుకుంటుంది. మాట్లాడేవాని అంతరంగిక జీవితం తల్లితో తృప్తిగా విశ్రమించే పాలు విడిచిన శిశువులా మారుతుంది, సమాజాన్ని నిలకడైన నిరీక్షణలోకి ఆహ్వానిస్తూ.
వినయంతృప్తినమ్మకంనిరీక్షణ
1యెహోవా, నా హృదయం గర్వం కలిగిలేదు, నా కళ్లు అహంకారం కలిగిలేవు. నేను గ్రహించలేని గొప్ప విషయాలను నాకు అసాధ్యమైన విషయాలను నేను పట్టించుకోను.
2పాలు విడచిన బిడ్డ సంతృప్తిగా ఉన్నట్లు, అవును, పాలు విడచిన బిడ్డ తన తల్లి ఒడిలో సంతృప్తిగా ఉన్నట్లు, నన్ను నేను నెమ్మదిపరచుకొని ప్రశాంతంగా ఉన్నాను.
3ఓ ఇశ్రాయేలు, ఇప్పటినుండి నిరంతరం యెహోవా పైనే నీ నిరీక్షణ ఉంచు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.