
యోనా 2
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
చేప లోపలి నుండి, యోనా లోతుల్లోకి మునిగిపోవడాన్ని, అలలు, కలుపుమొక్కలతో చుట్టుముట్టబడి మరణం దగ్గరవుతున్నట్లు గుర్తుచేసుకుంటాడు. అతను కర్త్తను గుర్తుచేసుకుని ఆలయం వైపు ప్రార్థనను నడిపిస్తాడు, శక్తిలేని విగ్రహాలను స్థిరమైన దయతో పోల్చుతూ. యోనా కృతజ్ఞతను ప్రమాణం చేసి, రక్షణ దేవుడికి చెందినదని ప్రకటించి, విడుదల చేయబడతాడు.
ప్రార్థనవిడుదలకృతజ్ఞతరక్షణ
1చేప కడుపులో నుండి యోనా తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశాడు.
2అతడు ఇలా ప్రార్థించాడు: “నా ఆపదలో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన నాకు జవాబిచ్చారు. మృత్యులోకంలో ఉండి సహాయం కోసం అడిగాను, మీరు నా మొర విన్నారు.
3మీరు నన్ను అగాధంలో సముద్ర గర్భంలో పడవేశారు. ప్రవాహాలు నన్ను ఆవరించాయి, మీ అలలు, తరంగాలు నన్ను ముంచి వేశాయి.
4‘నేను మీ సన్నిధి నుండి నన్ను తరిమివేసినా మరలా నేను పరిశుద్ధ ఆలయం వైపు తిరిగి చూస్తాను’ అనుకున్నాను.
5ముంచివేసే నీళ్లు నన్ను భయపెట్టాయి, అగాధం నన్ను ఆవరించింది; సముద్రంలో ఉన్న నాచు నా తలకు చుట్టుకుంది.
6పర్వతాల పునాదుల వరకు నేను మునిగాను, క్రిందున్న భూమి గడియలు నన్ను శాశ్వతంగా బంధించాయి. అయితే నా దేవా! యెహోవా, మీరు నా ప్రాణాన్ని గోతిలో నుండి పైకి తీసుకువచ్చారు.
7“నా ప్రాణం క్షీణిస్తూ ఉంటే, యెహోవా నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. నా ప్రార్థన మీ దగ్గరకు వచ్చింది, మీ పరిశుద్ధ ఆలయానికి చేరింది.
8“విలువలేని విగ్రహాలను పూజించేవారు, తమ పట్ల దేవునికున్న ప్రేమకు దూరమవుతారు.
9నేనైతే కృతజ్ఞత స్తుతులు చేస్తూ మీకు బలి అర్పిస్తాను. నేను చేసిన మ్రొక్కుబడి చెల్లిస్తాను, ‘రక్షణ యెహోవా నుండి వస్తుంది’ అని అంటాను.”
10యెహోవా ఆ చేపకు ఆజ్ఞాపించగా అది యోనాను పొడినేల మీద కక్కివేసింది.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.