Grieving Moabite families carrying belongings away from burning hill towns beside a moonlit stream

యెషయా 15

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
మోయాబు నగరాలు అకస్మాత్తుగా పడిపోతాయి, ఆలయాలు, వీధుల నుండి పొలాలు, జలమార్గాల వరకు విలాపం వ్యాపిస్తుంది. శరణార్థులు తమ ఆస్తులను మోసుకుంటారు, ఏడుపులు భూమి అంతటా ప్రతిధ్వనిస్తాయి, తీవ్రమైన సామూహిక నష్టం ద్వారా తీర్పును చిత్రిస్తూ.
విలాపంతీర్పుశరణార్థులుమోయాబు
1మోయాబుకు వ్యతిరేకంగా ప్రవచనం: ఒక రాత్రిలోనే మోయాబులోని ఆరు పట్టణం పాడై నశిస్తుంది! ఒక రాత్రిలోనే మోయాబులోని కీరు పట్టణం పాడై నశిస్తుంది!
2దీబోను ఏడ్వడానికి గుడికి తన క్షేత్రాలకు వెళ్తుంది; నెబో మెదెబా బట్టి మోయాబు రోదిస్తుంది. ప్రతి తల క్షౌరం చేయబడింది ప్రతివాని గడ్డం గొరిగించబడింది.
3వారు తమ సంతవీధులలో గోనెపట్ట కట్టుకుంటారు; తమ మేడల మీద, బహిరంగ స్థలాల్లో వారందరు రోదిస్తారు, ఏడుస్తూ కన్నీరు కారుస్తారు.
4హెష్బోను ఎల్యాలెహు మొరపెడుతున్నారు, యాహాజు వరకు వారి స్వరం వినబడుతుంది. కాబట్టి మోయాబీయుల వీరులు మొరపెడతారు, వారి హృదయాలు క్రుంగిపోతాయి.
5మోయాబు గురించి నా హృదయం మొరపెడుతుంది; వారిలో పారిపోయినవారు సోయరు వరకు, ఎగ్లత్-షెలీషియా వరకు పారిపోతారు. వారు లూహీతు ఎక్కుతున్నప్పుడు ఆ దారిలో ఏడుస్తూ ఎక్కుతారు; హొరొనయీము వెళ్లే దారిలో తమ నాశనం గురించి విలపిస్తారు.
6నిమ్రీము నీళ్లు ఎండిపోయాయి గడ్డి ఎండిపోయింది; వృక్ష సంపద ఉండదు పచ్చదనం ఎక్కడా మిగల్లేదు.
7కాబట్టి వారు సంపాదించి సమకూర్చుకున్న ఆస్తిని నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసికొని వెళ్తారు.
8వారి ఆర్తనాదాలు మోయాబు సరిహద్దులలో ప్రతిధ్వనిస్తాయి; వారి రోదన ఎగ్లయీము వరకు వారి ఏడ్పు బెయేర్-ఎలీము వరకు వినబడుతుంది.
9దీమోను నీళ్లు రక్తంతో నిండిపోయాయి కాని నేను దీమోను మీదికి ఇంకొక బాధను రప్పిస్తాను. మోయాబు నుండి తప్పించుకున్నవారి మీదికి ఆ దేశంలో మిగిలిన వారి మీదికి సింహాన్ని రప్పిస్తాను.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.