Hosea respectfully welcomes his estranged wife at a marketplace beside measured silver and sacks of barley

హోషేయ 3

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
విగ్రహారాధన ఉన్నప్పటికీ ఇశ్రాయేలు పట్ల దైవిక ప్రేమను ప్రతిబింబిస్తూ, అవిశ్వాసి స్త్రీని మళ్లీ ప్రేమించమని దేవుడు హోషేయకు చెబుతాడు. హోషేయ ఆమెను వెండి, బార్లీకి విమోచించి, విశ్వసనీయత కాలాన్ని కోరతాడు, ఇశ్రాయేలు లేమిని, దేవుని, దావీదు పాలన వైపు చివరి తిరిగి రావడాన్ని ముందుగా సూచిస్తూ.
విమోచనస్థిరమైన ప్రేమవిశ్వసనీయతతిరిగి రావడం
1యెహోవా నాతో, “వెళ్లు, నీ భార్యను వేరే వ్యక్తి ప్రేమించినా, వ్యభిచారిగా ఉన్నా ఆమెకు నీ ప్రేమను చూపించు. ఇశ్రాయేలీయులు ఇతర దేవుళ్ళను పూజించి పవిత్ర ద్రాక్షపండ్ల ముద్దలను ఆశించనప్పటికి, యెహోవా వారిని ప్రేమించినట్లు ఆమెను ప్రేమించు” అని చెప్పారు.
2కాబట్టి నేను పదిహేను వెండి నాణేలు, ఒక హోమెరు, ఒక లెతెకు యవలు ఇచ్చి ఆమెను కొనుక్కున్నాను.
3అప్పుడు ఆమెతో, “నీవు నాతో చాలా కాలం జీవించాలి; నీవు వేశ్యగా ఉండకూడదు, వేరే ఏ పురుషునితో సన్నిహితంగా ఉండకూడదు, అలాగే నేను నీ పట్ల నమ్మకంగా ఉంటాను” అన్నాను.
4ఎందుకంటే ఇశ్రాయేలీయులు చాలా కాలం రాజు గాని పాలకుడు గాని లేకుండా, బలులు గాని పవిత్ర రాళ్లు గాని లేకుండా, ఏఫోదు గాని గృహ దేవుళ్ళు గాని లేకుండా ఉంటారు.
5తర్వాత ఇశ్రాయేలీయులు తిరిగివచ్చి, తమ దేవుడైన యెహోవాను, తమ రాజైన దావీదును వెదుకుతారు. చివరి రోజుల్లో యెహోవా దగ్గరకు, ఆయన దీవెనలు దగ్గరకు వారు వణకుతూ వస్తారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.