The bronze altar and linen courtyard with Israelites preparing pure olive oil for the lamp

నిర్గమ 27

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
నిర్గమకాండము 27 కంచు బలిపీఠం, దాని పరికరాల గురించి సూచనలు ఇచ్చి, తరువాత నారబట్ట తెరలు, స్తంభాలు, పునాదులతో గుడారం ఆవరణను నిర్వచిస్తుంది. దీపం కర్త ముందు నిరంతరం సంరక్షించబడేలా స్వచ్ఛమైన ఒలీవ నూనె అవసరమని అధ్యాయం ముగుస్తుంది.
కంచు బలిపీఠంఆవరణఒలీవ నూనెనిరంతర వెలుగు
1“తుమ్మకర్రతో మూడు మూరల ఎత్తుగల బలిపీఠం కట్టాలి; అది అయిదు మూరల పొడవు అయిదు మూరల వెడల్పుతో చతురస్రంగా ఉండాలి.
2కొమ్ములు, బలిపీఠం ఒకే భాగంలా ఉండేలా దాని నాలుగు మూలల్లో ప్రతి మూలకు ఒక కొమ్మును చేయాలి. బలిపీఠాన్ని ఇత్తడితో పొదిగించాలి.
3దాని పాత్రలన్నిటిని అంటే బూడిద తొలగించడానికి కుండలు, పారలు, చల్లే గిన్నెలు, ముళ్ళ గరిటెలు, నిప్పు పెనాలను ఇత్తడితో చేయాలి.
4దానికి వలలాంటి ఇత్తడి జాలి తయారుచేసి, ఆ జాలి నాలుగు మూలల్లో ప్రతి మూలకు ఒక ఇత్తడి ఉంగరాన్ని తయారుచేసి,
5ఆ జాలి బలిపీఠం మధ్యకు చేరేలా బలిపీఠం గట్టు క్రింది భాగంలో దానిని ఉంచాలి.
6బలిపీఠం కోసం తుమ్మకర్రతో మోతకర్రలు తయారుచేసి, వాటిని ఇత్తడితో పొదిగించాలి.
7బలిపీఠాన్ని మోసినప్పుడు దాన్ని మోయడానికి ఉపయోగించే మోతకర్రలు దాని రెండు ప్రక్కలా ఉన్న ఉంగరాల్లో దూర్చాలి.
8పలకలను ఉపయోగించి బలిపీఠాన్ని గుల్లగా చేయాలి. కొండమీద నీకు చూపించిన నమూనా ప్రకారమే దాన్ని చేయాలి.
9“నీవు సమావేశ గుడారానికి ఆవరణం నిర్మించాలి. దక్షిణం వైపు వంద మూరల పొడవు గల పేనిన సన్నని నార తెరలు ఉండాలి.
10దానికి ఇరవై స్తంభాలు వాటికి ఇరవై ఇత్తడి దిమ్మలు, అలాగే ఆ స్తంభాలకు వెండి కొక్కేలు, బద్దలు ఉండాలి.
11ఉత్తరం వైపు కూడా వంద మూరల పొడవు ఉండాలి, ఇరవై స్తంభాలు, ఇరవై ఇత్తడి దిమ్మలు, స్తంభాల మీద వెండి కొక్కేలు, దిమ్మలు ఉండాలి.
12“పడమటి వైపున ఆవరణం వెడల్పులో యాభై మూరల తెరలు ఉండాలి, వాటికి పది స్తంభాలు, పది దిమ్మలు ఉండాలి.
13తూర్పు వైపు అనగా సూర్యోదయం వైపు కూడా, ఆవరణం యాభై మూరల వెడల్పు ఉండాలి.
14ప్రవేశ ద్వారానికి ఒక ప్రక్క పదిహేను మూరల పొడవు గల తెరలు, వాటికి మూడు స్తంభాలు వాటికి మూడు దిమ్మలు ఉండాలి.
15అటు ప్రక్కన మూడు స్తంభాలు, మూడు దిమ్మలతో పదిహేను మూరల పొడవు గల తెరలు ఉండాలి.
16“ఆవరణం యొక్క ద్వారానికి నీలం ఊదా ఎరుపు రంగుల పేనిన సన్నని నారతో బుటా పనితో చేసిన ఇరవై మూరల పొడవు గల తెర ఉండాలి. దానికి నాలుగు స్తంభాలు వాటికి నాలుగు దిమ్మలు ఉండాలి.
17ఆవరణం చుట్టూ ఉన్న స్తంభాలన్నిటికి వెండి బద్దలు కొక్కేలు ఇత్తడి దిమ్మలు ఉండాలి.
18ఆవరణం పొడవు వంద మూరలు వెడల్పు యాభై మూరలు, ఎత్తు అయిదు మూరలు; అవి పేనిన నారతో చేసిన తెరలు వాటికి దిమ్మలు ఇత్తడివి.
19సమావేశ గుడారం యొక్క సేవలో వాడబడే ఉపకరణాలన్నీ, వాటి పనులేవైనా, దాని కొరకైన గుడారపు మేకులన్నీ, ఆవరణం కొరకైన వాటితో సహా అన్నీ ఇత్తడివై ఉండాలి.
20“వెలుగు కోసం దీపాలు వెలుగుతూ ఉండేలా దంచి తీసిన ఒలీవ నూనెను మీ దగ్గరకు తీసుకురావాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు.
21సమావేశ గుడారంలో, నిబంధన మందసాన్ని కప్పి ఉంచే తెర బయట, అహరోను, అతని కుమారులు సాయంత్రం నుండి ఉదయం వరకు యెహోవా ఎదుట దీపాలను వెలిగించాలి. ఇది ఇశ్రాయేలీయుల రాబోయే తరాలకు మధ్య నిత్య కట్టుబాటుగా ఉంటుంది.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.