A skilled worker sharpening an iron tool beside a well-kept house and a neglected building

ప్రసంగి 10

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కొద్దిపాటి మూర్ఖత్వం జ్ఞానం, గౌరవాన్ని అధిగమించగలదు. తొందరపాటు పాలకులు, అజాగ్రత్త మాట, మొద్దుబారిన పనిముట్లు, సోమరితనం, క్రమశిక్షణ లేని నాయకులు అస్తవ్యస్తత, ప్రమాదాన్ని తెస్తాయి. ప్రశాంత స్పందనలు, ఆచరణాత్మక నైపుణ్యం, సకాల ప్రయత్నం, కాచుకున్న మాటలు ఊహించని పర్యవసానాల లోకంలో ప్రజలకు సహాయపడతాయి.
జ్ఞానం, మూర్ఖత్వంమాటనైపుణ్యంనాయకత్వంశ్రద్ధ
1పరిమళతైలంలో పడిన చచ్చిన ఈగలు దానికి చెడు వాసన తెచ్చినట్లు, కొంచెం మూర్ఖత్వం జ్ఞానాన్ని ఘనతను పాడుచేస్తుంది.
2జ్ఞాని హృదయం కుడి చేతిలో ఉంటుంది, కాని మూర్ఖుడి హృదయం ఎడమ చేతిలో ఉంటుంది.
3తెలివిలేనివారు దారిలో సరిగా నడవలేక వారు ఎంత తెలివితక్కువ వారు అనేది అందరికి చూపిస్తారు.
4వారు ఎంత తెలివితక్కువ వారు అనేది, మీ ఉద్యోగాన్ని వదిలేయవద్దు; ప్రశాంతత గొప్ప నేరాలు జరుగకుండ ఆపుతుంది.
5నేను సూర్యుని క్రింద ఒక చెడ్డ విషయాన్ని చూశాను, ఒక పాలకుడు పొరపాటున చేసిన అన్యాయం:
6అదేమిటంటే మూర్ఖులను ఉన్నత పదవులలో, సమర్థులను దిగువ స్థాయిలో ఉంచడమే.
7నేను బానిసలు గుర్రాలపై, యువరాజులు బానిసల్లా కాలినడకన వెళ్లడం చూశాను.
8గొయ్యి త్రవ్వినవారే అందులో పడతారు; గోడను పడగొట్టిన వారే పాము కాటుకు గురవుతారు.
9రాళ్లు దొర్లించేవారు దానివల్ల గాయపడతారు; మొద్దులను చీల్చేవారు వాటి వల్ల ప్రమాదానికి గురి అవుతారు.
10ఒకవేళ గొడ్డలి మొద్దుబారి దాని అంచుకు పదును పెట్టకపోతే, ఎక్కువ బలం ఉపయోగించాల్సి ఉంటుంది, అయితే జ్ఞానం విజయాన్ని తెస్తుంది.
11ఒకవేళ లొంగదీయక ముందే పాము కాటేస్తే, పాములు ఆడించేవానికి లాభం ఉండదు.
12జ్ఞానుల నోటి నుండి వచ్చే మాటలు దయగలవి, కాని మూర్ఖుని పెదవులు వానినే మ్రింగివేస్తాయి.
13అవివేకంతో మొదలైన వారి మాటలు; దుర్మార్గపు వెర్రితనంతో ముగుస్తాయి;
14అయినా మూర్ఖులు వాగుతూనే ఉంటారు. ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు వారు చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ఎవరు చెప్పగలరు?
15మూర్ఖులకు పట్టణానికి వెళ్లడానికి దారి తెలియదు; కాబట్టి తమ శ్రమతో వారు అలసిపోతారు.
16దాసుడు రాజుగా ఉన్న దేశానికి ఉదయాన్నే విందు చేసుకొనే యువరాజులు ఉన్న దేశానికి శ్రమ.
17గొప్ప జన్మ కలిగినవాడు రాజుగా ఉన్న దేశం మత్తు కోసం కాక బలం కోసం సరైన సమయంలో భోజనానికి కూర్చునే అధిపతులు ఉన్న దేశం ధన్యమైనది.
18ఒకని సోమరితనం వల్ల ఇంటికప్పు కూలిపోతుంది, ఒకని బద్దకం వల్ల ఇల్లు కారిపోతుంది.
19నవ్వడం కోసం విందు చేస్తారు, ద్రాక్షరసం జీవితానికి సంతోషం కలిగిస్తుంది, డబ్బు ప్రతిదానికీ సమాధానం.
20మీ ఆలోచనలో కూడా రాజును తిట్టవద్దు, మీ పడకగదిలో కూడా ధనికులను శపించవద్దు, ఎందుకంటే ఆకాశపక్షులు, రెక్కలున్న పక్షులు మీరు చెప్పేవాటిని బయట పెట్టవచ్చు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.