A bright river runs through a grieving city from crowded shrines toward a gate where elders hear the cause of poor families

ఆమోసు 5

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
ఆమోసు పడిపోయిన ఇశ్రాయేలును విలపించి, నాశనమైన పవిత్ర స్థలాలకు బదులుగా దేవుడిని, మంచిని, న్యాయాన్ని వెతకమని పదే పదే ప్రజలను కోరతాడు. అవినీతి న్యాయస్థానాలు పేదవారిని అణచివేస్తుండగా మతపరమైన పండుగలు కొనసాగుతాయి. న్యాయం, నీతి నిరంతరం ప్రవహించకపోతే కోరుకున్న కర్త్త దినం చీకటిగా ఉంటుంది.
దేవుడిని వెతకడంన్యాయంవట్టి మతంకర్త్త దినం
1ఇశ్రాయేలూ! ఈ మాట విను, ఇది మిమ్మల్ని గురించి విలాప వాక్కు:
2“ఇశ్రాయేలు కన్య పడిపోయింది, ఆమె మరి ఎన్నడు లేవదు, ఆమెను లేపడానికి ఎవరూ లేక తన సొంత నేలపై పడి ఉంది.”
3ప్రభువైన యెహోవా ఇశ్రాయేలుతో చెప్పే మాట ఇదే: “నీ పట్టణం నుండి వేయిమంది బలమైన వారు బయలుదేరితే, వందమంది మాత్రమే మిగులుతారు. నీ పట్టణం నుండి వందమంది బలమైన వారు బయలుదేరితే పదిమంది మాత్రమే మిగులుతారు.”
4యెహోవా ఇశ్రాయేలుతో చెప్పే మాట ఇదే: “నన్ను వెదికితే బ్రతుకుతారు.
5బేతేలును ఆశ్రయించకండి; గిల్గాలు క్షేత్రాలకు వెళ్లకండి, బెయేర్షేబకు ప్రయాణించకండి. గిల్గాలు ప్రజలు ఖచ్చితంగా బందీలుగా వెళ్తారు, విపత్తులతో బేతేలు శూన్యంగా మారుతుంది.”
6యెహోవాను వెదకండి మీరు బ్రతుకుతారు, లేదంటే యోసేపు గోత్రాల మీద ఆయన అగ్నిలా పడతారు; అది వారిని కాల్చివేస్తుంది బేతేలులో దాన్ని ఆర్పివేయగల వారెవరూ ఉండరు.
7వారు న్యాయాన్ని చేదుగా మార్చి నీతిని నేల మీద పడవేస్తారు.
8ఆయన సప్తర్షి నక్షత్రాలను మృగశీర్ష నక్షత్రాలను సృష్టించారు, ఆయన మధ్యరాత్రిని ఉదయంగా మారుస్తారు, పగటిని చీకటి చేస్తారు. ఆయన సముద్రంలోని నీటిని రప్పించి. భూమి మీద కుమ్మరిస్తారు ఆయన పేరు యెహోవా.
9ఆయన మెరుపు వేగంతో దుర్గాన్ని నాశనం చేస్తారు, వారి కోటగల పట్టణాన్ని నాశనం చేస్తారు.
10న్యాయస్థానంలో న్యాయం కోసం నిలబడే వారిని యథార్థంగా మాట్లాడేవారిని ద్వేషించేవారు మీలో ఉన్నారు.
11మీరు బీదలను అణగద్రొక్కుతూ, వారి ధాన్యం మీద పన్ను వేస్తారు. కాబట్టి మీరు రాళ్లతో భవనాలను కట్టుకున్నా, వాటిలో కాపురముండరు; అందమైన ద్రాక్షతోటలు నాటినా మీరు ఆ పండ్ల రసం త్రాగరు.
12ఎందుకంటే మీ అపరాధాలు ఎన్ని ఉన్నాయో మీ పాపాలు ఎంత ఘోరమైనవో నాకు తెలుసు. మీరు లంచాలు తీసుకుని అమాయకులను బాధిస్తారు, న్యాయస్థానంలో వచ్చే బీదలకు న్యాయం జరగనివ్వరు.
13ఇది చెడుకాలం కాబట్టి, అలాంటి సమయాల్లో వివేకవంతులు మౌనంగా ఉంటారు.
14చెడును విడిచిపెట్టి మంచిని వెదకండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. అప్పుడు ఆయన గురించి మీరనుకున్న విధంగా సైన్యాల యెహోవా దేవుడు మీతో ఉంటారు.
15చెడును ద్వేషించి మంచిని ప్రేమించండి; న్యాయస్థానాల్లో న్యాయం జరిగించండి. బహుశ సైన్యాల యెహోవా దేవుడు, యోసేపు వంశంలో మిగిలి ఉన్నవారిపై దయ చూపిస్తారేమో.
16కాబట్టి ప్రభువు, సైన్యాల యెహోవా దేవుడు చెప్పే మాట ఇదే: “వీధులన్నిటిలో విలాపం ఉండబోతుంది ప్రతి రాజ మార్గంలో వేదనతో కూడిన ఏడ్పులు. ఏడ్వడానికి రైతులను దుఃఖపడడానికి విలపించేవారిని పిలుస్తారు.
17ద్రాక్షతోటలన్నిటిలో శోకం ఉంటుంది, ఎందుకంటే నేను మీ మధ్యలో సంచరిస్తాను,” అని యెహోవా అంటున్నారు.
18యెహోవా దినం రావాలని ఆశించే మీకు శ్రమ! యెహోవా దినం కోసం ఎందుకు మీరు ఆశిస్తున్నారు? ఆ దినం వెలుగుగా కాదు, చీకటిగా ఉంటుంది.
19అది ఒక మనిషి సింహం నుండి తప్పించుకుని ఎలుగుబంటి ఎదురు పడినట్లు, అతడు ఇంట్లోకి ప్రవేశించి గోడ మీద చేయి పెడితే పాము కరిచినట్టుగా ఉంటుంది.
20యెహోవా దినం వెలుగుగా కాకుండా అంధకారంగా ఉంటుంది కదా, ఒక్క కాంతి కిరణం కూడా లేకుండ కారుచీకటిగా ఉంటుంది కదా?
21“మీ పండుగలంటే నాకు అసహ్యం, వాటిని నేను ద్వేషిస్తాను; మీ సమావేశాల్లో నేను సంతోషించను.
22మీరు నాకు దహనబలులు, భోజనార్పణలు సమర్పించినా, నేను వాటిని స్వీకరించను. మీరు క్రొవ్విన జంతువులను సమాధానబలులుగా సమర్పించినా, నేను వాటిని లెక్కచేయను.
23మీ పాటల ధ్వని నా నుండి తీసివేయండి! మీ సితారాల సంగీతం నేను వినను.
24అయితే న్యాయం నదీ ప్రవాహంలా, నీతి ఎన్నడూ ఎండిపోని కాలువలా ప్రవహించాలి.
25“ఇశ్రాయేలు ప్రజలారా, అరణ్యంలో నలభై సంవత్సరాలు, మీరు నాకు బలులు, అర్పణలు తెచ్చారా?
26మీరు మీ సక్కూతు రాజ దేవుని క్షేత్రాన్ని, మీ కైవాన్ విగ్రహాలను, మీ కోసం మోసుకొచ్చారు. అది మీరు మీ కోసం చేసుకుంది.
27కాబట్టి నేను మిమ్మల్ని దమస్కు అవతలికి బందీలుగా పంపిస్తాను,” అని సైన్యాల దేవుడు అని పేరు కలిగిన యెహోవా అంటున్నారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.