
1 దినవృత్తాంతములు 27
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
నెలవారీ సైనిక విభాగాలు, గోత్ర నాయకులు, ఖజానా అధికారులు, క్షేత్ర నిర్వాహకులు, ద్రాక్షతోట సంరక్షకులు, గొర్రెల కాపరులు, సలహాదారులు దావీదు పరిపాలనను రూపొందిస్తారు. వివరణాత్మక నిర్మాణం జాతీయ జీవితం అంతటా ప్రత్యేక బాధ్యతను గౌరవిస్తుంది.
పరిపాలనకారియస్తత్వంనాయకత్వంక్రమం
1ఇది ఇశ్రాయేలీయుల కుటుంబ నాయకులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, వివిధ విషయాల్లో రాజుకు సేవలందించే అధికారుల జాబితా. వీరిలో ప్రతి విభాగం సంవత్సరంలో ఒక నెల చొప్పున సేవ చేస్తారు. ఒక్కొక్క విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
2మొదటి నెలలో మొదటి విభాగం మీద జబ్దీయేలు కుమారుడైన యషోబీము అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
3అతడు పెరెసు వారసుడు, మొదటి నెల సైన్యాధిపతులందరికీ అధిపతిగా ఉన్నాడు.
4రెండవ నెల విభాగం మీద అహోహీయుడైన దోదైది అధిపతిగా ఉన్నాడు; అతని విభాగానికి నాయకుడు మిక్లోతు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
5మూడవ నెలకు యాజకుడైన యెహోయాదా కుమారుడైన బెనాయా మూడవ సైన్యాధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
6ఈ బెనాయా పరాక్రమశాలి, ముప్పైమంది వీరులలో ఒకనిగా, ఆ ముప్పైమందికి అధిపతిగా ఉన్నాడు. అతని కుమారుడైన అమ్మీజాబాదు అతని విభాగంలో అధిపతిగా ఉన్నాడు.
7నాలుగవ నెలకు యోవాబు సోదరుడైన అశాహేలు నాలుగో విభాగం మీద అధిపతిగా ఉన్నాడు; అతని తర్వాత, అతని కుమారుడైన జెబద్యా అధిపతి అయ్యాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
8అయిదవ నెలకు ఇశ్రాహేతీయుడైన షంహూతు అయిదవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
9ఆరవ నెలకు తెకోవీయుడైన ఇక్కేషు కుమారుడైన ఈరా, ఆరవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
10ఏడవ నెలకు ఎఫ్రాయిమీయుడు పెలోనీయుడైన హేలెస్సు ఏడవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
11ఎనిమిదవ నెలకు జెరహీయుల బంధువైన హుషాతీయుడైన సిబ్బెకై ఎనిమిదవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
12తొమ్మిదవ నెలకు బెన్యామీనీయుడు అనాతోతీయుడైన అబీయెజెరు తొమ్మిదవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
13పదవ నెలకు జెరహీయుడు, నెటోపాతీయుడైన మహరై పదవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
14పదకొండవ నెలకు ఎఫ్రాయిమీయుడు పిరాతోనీయుడునైన బెనాయా పదకొండవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
15పన్నెండవ నెలకు నెటోపాతీయుడునైన ఒత్నీయేలు వంశస్థుడైన హెల్దయి పన్నెండవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
16ఇశ్రాయేలీయుల గోత్రాల నాయకులు: రూబేనీయులమీద: జిఖ్రీ కుమారుడైన ఎలీయెజెరు; షిమ్యోనీయుల మీద: మయకా కుమారుడైన షెఫట్యా;
17లేవీయుల మీద: కెమూయేలు కుమారుడైన హషబ్యా; అహరోనీయుల మీద: సాదోకు;
18యూదా వారి మీద: దావీదు సోదరుడైన ఎలీహు; ఇశ్శాఖారీయుల మీద: మిఖాయేలు కుమారుడైన ఒమ్రీ;
19జెబూలూనీయుల మీద: ఓబద్యా కుమారుడైన ఇష్మయా; నఫ్తాలీయుల మీద: అజ్రీయేలు కుమారుడైన యెరీమోతు;
20ఎఫ్రాయిమీయుల మీద: అజజ్యాహు కుమారుడైన హోషేయ; మనష్షే అర్థగోత్రం మీద: పెదాయా కుమారుడైన యోవేలు;
21గిలాదులోని మనష్షే అర్థగోత్రం మీద: జెకర్యా కుమారుడైన ఇద్దో; బెన్యామీనీయుల మీద: అబ్నేరు కుమారుడైన యయశీయేలు;
22దానీయుల మీద: యెరోహాము కుమారుడైన అజరేలు. వీరు ఇశ్రాయేలు గోత్రాలకు నాయకులు.
23ఇశ్రాయేలును ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా చేస్తానని యెహోవా వాగ్దానం చేశారు, కాబట్టి ఇరవై సంవత్సరాలు, అంతకన్నా తక్కువ వయస్సున్న వారిని దావీదు లెక్కించలేదు.
24సెరూయా కుమారుడైన యోవాబు జనాభా లెక్కలు వ్రాయడానికి ఆరంభించాడు కాని దానిని ముగించలేదు. జనాభా లెక్కలు వ్రాయడం వలన ఇశ్రాయేలు మీదికి దేవుని ఉగ్రత వచ్చింది కాబట్టి ఆ జనసంఖ్య రాజైన దావీదు చరిత్ర గ్రంథంలో నమోదు కాలేదు.
25రాజ్య గిడ్డంగులకు అదీయేలు కుమారుడైన అజ్మావెతు అధికారి. పల్లెప్రాంతాలలో, పట్టణాల్లో గ్రామాల్లో కోటలలో ఉన్న గిడ్డంగులకు ఉజ్జియా కుమారుడైన యోనాతాను అధికారి.
26పొలాల్లో పని చేసేవారిమీద, భూమి దున్నే వారి మీద కెలూబు కుమారుడైన ఎజ్రీ అధికారి.
27ద్రాక్షతోటల మీద రామతీయుడైన షిమీ అధికారి. ద్రాక్షతోటల నుండి ఉత్పత్తి అయ్యే ద్రాక్షరసాన్ని నిల్వజేసే తొట్టెల మీద షిప్మీయుడైన జబ్ది అధికారి.
28పశ్చిమ దిగువ ప్రాంతంలో ఉన్న ఒలీవచెట్లు, మేడిచెట్ల మీద గెదేరీయుడైన బయల్-హనాను అధికారి. ఒలీవనూనె గిడ్డంగులకు యోవాషు అధికారి.
29షారోనులో మేసే పశువులమీద షారోనీయుడైన షిట్రయి అధికారి. లోయలలోని పశువులమీద అద్లయి కుమారుడైన షాపాతు అధికారి.
30ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఓబీలు అధికారి. గాడిదల మీద మేరోనోతీయుడైన యెహెద్యాహు అధికారి.
31మందల మీద హగ్రీయుడైన యాజీజు అధికారి. వీరందరు రాజైన దావీదు ఆస్తి మీద నియమించబడిన అధికారులు.
32దావీదు పినతండ్రియైన యోనాతాను సలహాదారుడు, వివేకం ఉన్నవాడు, లేఖికుడు. హక్మోనీ కుమారుడైన యెహీయేలు రాజకుమారుల సంరక్షకుడు.
33అహీతోపెలు రాజు యొక్క సలహాదారుడు. అర్కీయుడైన హూషై రాజుకు సన్నిహితుడైన మిత్రుడు.
34అహీతోపెలు తర్వాత బెనాయా కుమారుడైన యెహోయాదా, అబ్యాతారులు అతని స్థానంలో సలహాదారులయ్యారు. రాజ్య సైన్యానికి యోవాబు అధిపతి.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.