
1 దినవృత్తాంతములు 2
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
యూదా సంతానం విశ్వసనీయ, లోతుగా లోపభూయిష్ట కుటుంబాల ద్వారా విప్పుకుంటుంది, పెరెసు, హెస్రోను, కాలేబు, రాము తో సహా. చివరికి రికార్డు యెష్షయి, అతని కుమారుల వరకు చేరి, దావీదును సంక్లిష్ట వారసత్వ కథలో ఉంచుతుంది.
యూదావంశావళిదావీదువారసత్వం
1ఇశ్రాయేలు కుమారులు: రూబేను, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను,
2దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు.
3యూదా కుమారులు: ఏరు, ఓనాను, షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన బత్-షుయ కుమార్తెకు జన్మించారు. యూదాకు మొదటి కుమారుడైన ఏరు యెహోవా దృష్టిలో చెడ్డవానిగా ఉన్నాడు కాబట్టి ఆయన వానిని చంపారు.
4యూదా కోడలు తామారు ద్వారా అతనికి పెరెసు, జెరహులు పుట్టారు. యూదా కుమారులందరు మొత్తం అయిదుగురు.
5పెరెసు కుమారులు: హెస్రోను, హామూలు.
6జెరహు కుమారులు: జిమ్రీ, ఏతాను, హేమాను, కల్కోలు, దార. వీరు అయిదుగురు.
7కర్మీ కుమారుడు: ఆకారు, అతడు ప్రత్యేకపరచబడిన వాటిని ముట్టకూడదని నిషేధించబడిన కొన్నిటిని తీసుకుని ఇశ్రాయేలుకు బాధను తీసుకువచ్చాడు.
8ఏతాను కుమారుడు: అజర్యా.
9హెస్రోనుకు జన్మించిన కుమారులు: యెరహ్మెయేలు, రాము, కాలేబు.
10రాము కుమారుడు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. అతడు యూదా ప్రజల నాయకుడు.
11నయస్సోను కుమారుడు శల్మాను. శల్మాను కుమారుడు బోయజు.
12బోయజు కుమారుడు ఓబేదు. ఓబేదు కుమారుడు యెష్షయి.
13యెష్షయి కుమారులు: మొదటివాడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షిమ్యా,
14నాలుగవవాడు నెతనేలు, అయిదవవాడు రద్దయి,
15ఆరవవాడు ఓజెము, ఏడవవాడు దావీదు.
16సెరూయా, అబీగయీలు వారి సహోదరీలు. సెరూయా కుమారులు ముగ్గురు: అబీషై, యోవాబు, అశాహేలు.
17అబీగయీలు అమాశా తల్లి. ఇష్మాయేలీయుడైన యెతెరు అమాశా తండ్రి.
18హెస్రోను కుమారుడైన కాలేబుకు అతని భార్య అజూబా ద్వారా (యెరీయోతు ద్వారా) పిల్లలు కలిగారు. ఆమె కుమారులు వీరు: యేషెరు, షోబాబు, అర్దోను.
19అజూబా చనిపోయాక కాలేబు ఎఫ్రాతాను పెళ్ళి చేసుకున్నాడు, ఆమె ద్వారా అతనికి హూరు పుట్టాడు.
20హూరు కుమారుడు ఊరి. ఊరి కుమారుడు బెసలేలు.
21తర్వాత, హెస్రోను అరవై సంవత్సరాల వయస్సులో గిలాదు తండ్రియైన మాకీరు కుమార్తెను పెళ్ళి చేసుకుని ఆమెతో శయనించినప్పుడు ఆమె ద్వారా అతనికి సెగూబు పుట్టాడు.
22సెగూబు కుమారుడు యాయీరు. యాయీరుకు గిలాదులో ఇరవై మూడు పట్టణాలున్నాయి.
23(అయితే గెషూరు, అరాము, హవ్వోత్ యాయీరును, కెనాతును దానికి చెందిన పట్టణాలను మొత్తం అరవై పట్టణాలను వారి నుండి స్వాధీనం చేసుకున్నారు.) వీరందరు గిలాదు తండ్రియైన మాకీరు సంతానము.
24కాలేబు ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తర్వాత, అతని భార్య అబీయా ద్వారా అతనికి తెకోవాకు తండ్రియైన అష్షూరు పుట్టాడు.
25హెస్రోను మొదటి కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు: మొదటి వాడైన రాము, బూనా, ఓరెను, ఓజెము, అహీయా.
26యెరహ్మెయేలుకు అటారా అనే మరో భార్య ఉంది. ఆమె ఓనాముకు తల్లి.
27యెరహ్మెయేలుకు మొదటి కుమారుడైన రాము కుమారులు: మయజు, యామీను, ఏకెరు.
28ఓనాము కుమారులు: షమ్మయి యాదా. షమ్మయి కుమారులు: నాదాబు, అబీషూరు.
29అబీషూరు భార్యపేరు అబీహయిలు, ఆమె ద్వారా అతనికి అహ్బాను, మొలీదులు పుట్టారు.
30నాదాబు కుమారులు: సెలెదు, అప్పయీము. సెలెదు పిల్లలు లేకుండానే చనిపోయాడు.
31అప్పయీము కుమారుడు: ఇషీ, ఇషీ కుమారుడు షేషాను. షేషాను కుమారుడు అహ్లయి.
32షమ్మయి సోదరుడైన యాదా కుమారులు: యెతెరు, యోనాతాను. యెతెరు పిల్లలు లేకుండానే చనిపోయాడు.
33యోనాతాను కుమారులు: పేలెతు, జాజా. వీరు యెరహ్మెయేలు సంతానము.
34షేషానుకు కుమారులు లేరు, కుమార్తెలే ఉన్నారు. షేషానుకు ఈజిప్టు వాడైన యర్హా అనే సేవకుడున్నాడు.
35షేషాను తన కుమార్తెను తన సేవకుడైన యర్హాకు ఇచ్చి పెళ్ళి చేశాడు. ఆమె ద్వారా అతనికి అత్తయి పుట్టాడు.
36అత్తయి కుమారుడు నాతాను, నాతాను కుమారుడు జాబాదు,
37జాబాదు కుమారుడు ఎప్లాలు, ఎప్లాలు కుమారుడు ఓబేదు,
38ఓబేదు కుమారుడు యెహు, యెహు కుమారుడు అజర్యా,
39అజర్యా కుమారుడు హేలెస్సు, హేలెస్సు కుమారుడు ఎల్యాశా,
40ఎల్యాశా కుమారుడు సిస్మాయీ, సిస్మాయీ కుమారుడు షల్లూము,
41షల్లూము కుమారుడు యెకమ్యా, యెకమ్యా కుమారుడు ఎలీషామా.
42యెరహ్మెయేలు సోదరుడైన కాలేబు కుమారులు: మొదటి కుమారుడు జీఫు తండ్రియైన మేషా, హెబ్రోను తండ్రియైన మారేషా.
43హెబ్రోను కుమారులు: కోరహు, తప్పూయ, రేకెము, షెమ.
44షెమ కుమారుడు రహము, రహము కుమారుడు యోర్కెయాము. రేకెము కుమారుడు షమ్మయి.
45షమ్మయి కుమారుడు మాయోను, మాయోను కుమారుడు బేత్-సూరు.
46కాలేబు ఉంపుడుగత్తె ఏఫాకు పుట్టినవారు: హారాను, మోజా, గాజేజు. హారాను కుమారుడు గాజేజు.
47యహ్దయి కుమారులు: రెగెము, యోతాము, గేషాను, పెలెటు, ఏఫా, షయపు.
48కాలేబు ఉంపుడుగత్తె మయకాకు పుట్టినవారు: షెబెరు, తిర్హనా.
49ఆమెకు మద్మన్నా తండ్రియైన షయపు, మక్బేనా, గిబియాలకు తండ్రియైన షెవా కూడా పుట్టారు. కాలేబు కుమార్తె అక్సా.
50వీరు కాలేబు సంతానము. ఎఫ్రాతా మొదటి కుమారుడైన హూరు కుమారులు: కిర్యత్-యారీము తండ్రియైన శోబాలు,
51బేత్లెహేము తండ్రియైన శల్మా, బేత్-గాదేరు తండ్రియైన హారేపు.
52కిర్యత్-యారీము తండ్రియైన శోబాలు సంతానం: హారోయే, మెనుహోతీయుల్లో సగం మంది,
53కిర్యత్-యారీము వంశస్థులు: ఇత్రీయులు, పూతీయులు, షుమ్మాతీయులు, మిష్రాయీయులు. వీరినుండి సొరాతీయులు, ఎష్తాయులీయులు వచ్చారు.
54శల్మా వారసులు: బేత్లెహేము, నెటోపాతీయులు, అత్రోత్-బేత్-యోవాబు, మనహతీయుల్లో సగభాగంగా ఉన్న జారీయులు,
55యబ్బేజులో నివసించే లేఖికుల వంశాలు: తిరాతీయులు, షిమ్యాతీయులు, శూకోతీయులు. వీరు రేకాబీయులకు తండ్రియైన హమాతుకు నుండి వచ్చిన కెనీయులు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.